తెలంగాణ: తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో ఊరట లభించింది. మల్లన్న సతీమణి మాతమ్మ వేసిన పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానం విచారించింది. మల్లన్నపై ఒకే కారణంతో పలు కేసులు నమోదు చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మల్లన్నను అరెస్ట్ చేయాలన్న, మరో కేసు నమోదు చేయాలన్నా డీజీపీ అనుమతి తప్పనిసరని తెలిపింది. డీజీపీ పర్యవేక్షణలోనే విచారణ జరగాలని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్‌పై రేపు మరోసారి హైకోర్టులో మల్లన్న తరుపు న్యాయవాది వాదనలు వినిపించున్నారు.