హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్… సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. తెల్లవారుజాము నుంచే పోలింగ్ సెంటర్ వద్దకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. కరోనా జాగ్రత్తలతో పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్ నమోదు అయింది. రాత్రి 7 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉండడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం వుంది. ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు నవంబర్ 2న జరగనుంది. అటు ఇల్లంతకుంట 224 బూత్‌లో పోలింగ్ నిలిచిపోయింది. సాంకేతిక సమస్యగా చెప్పిన ఎన్నికల అధికారి, క్యూ లైన్‌లో ఓటర్లు వేచి ఉన్నారు.