అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. చుట్టూ భద్రత బలగాలు, బయటకెళ్లాలంటే బుల్లెట్ ప్రూఫ్ కారు, ఫుల్ సెక్యూరిటీ నడుమ పర్యటనలు. కానీ జో బైడెన్ సరదాగా సైకిల్ తొక్కుతుండగా అనుకోకుండా కిందపడిపోయాడు. ఇంకేముంది క్షణాల్లో దానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే..
డెలావర్‌లోని తన నివాసానికి సమీపంలో ఉన్న కేప్ హెన్లోపెన్ పార్కు వద్ద ఆయన సైకిలెక్కారు. జిల్ బైడెన్‌తో పాటు మరికొందరితో కలిసి బైడెన్ సైకిల్ రైడ్ తనను చూడడానికి వచ్చినవారి వద్దకు వెళ్లడానికి ఆయన సిద్ధమవుతున్నప్పుడు పెడల్‌లో పాదం ఇరుక్కుపోయింది.
కిందికి దిగబోతున్న ఆయన తూలి, కుడివైపు పడిపోయారు. అక్కడే ఉన్న కొందరు వెంటనే బైడెన్‌ను పైకిలేపారు. కాగా ఈ ఘటనలో బైడెన్‌కు ఎలాంటి గాయం కాలేదు. ‘ఐయామ్ గుడ్’ అని అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు.