రోడ్డుపై కత్తితో న్యూసెన్స్ చేసిన మాజీ మంత్రి కొడుకు..మద్యం మత్తే కారణమా?

0
85

ప్రస్తుతకాలంలో అందరు మద్యానికి బానిసై తాగిన మైకంలో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితికి దిగజారుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం మహిళల జీవితాలపై పడి అంధకార మయం అవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కొడుకు మద్యం తాగిన మత్తులో రోడ్డుపై కత్తితో న్యూసెన్స్ చేసిన ఘటన అందరిని భయభ్రాంతులను చేసింది.

వివరాల్లోకి వెళితే..షాజాపూర్ కు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి హుకుమా కరాడా కొడుకు రోహితప్ సింగ్ తన ఎస్వియు కారులో మద్యం తాగుతూ రోడ్డు మీద ఉన్న వ్యాపారి దినేష్ అహుజా కారును ఢీ కొట్టాడు. దాంతో బాధితుడు దినేష్ సూటిగా ప్రశ్నించగా.. రోహితప్ తీవ్రంగా రెచ్చిపోయి నడిరోడ్డుపై హల్ చల్ చేసాడు.

దాంతో ఆ బాధితుడు పోలీసులకు పిర్యాదు చేస్తా కారులోంచి దిగు అని అనడంతో అతడు వారిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోయినట్లు బాధితుడు చెబుతున్నారు. తన కారు పగిలినందుకు నష్టపరిహారం చెల్లించాలంటూ బాధితుడు దినేష్ చెప్పిన వివరాల మేరకు అష్టా పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ అనిల్ యాదవ్ కేసు నమోదు చేసారు.