ఆఫ్ఘనిస్థాన్ లో మహిళలకు మరో కొత్త రూల్ తీసుకువచ్చిన తాలిబన్లు

The Taliban brought another new rule for women in Afghanistan

0
106

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు మారిపోయాము అని చెబుతున్నా వారి కఠిన ఆంక్షలు నిర్ణయాలు గతంలో ఎలా ఉన్నాయో అలాగే ఉంటున్నాయి. విద్య పై ఎన్నో కొత్త రూల్స్ తీసుకువస్తున్నారు. మహిళలు ఉద్యోగాలు చేయకూడదు అని చెబుతున్నారు. కో ఎడ్యుకేషన్ వద్దు అని ఆపేశారు. ఇలా కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తున్నారు.

బాలికలు, మహిళలు నాలుగు గోడల మధ్య ఉండాల్సిందేనని హుకూం జారీ చేశారు. తాజాగా తాలిబన్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ దేశ మహిళలు క్రికెట్తో సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొన కూడదు అని తెలిపారు. ఎందుకంటే క్రీడలు వారి శరీరాలను బహిర్గతం చేస్తాయని అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు.

ఇక చాలా మంది ఆఫ్ఘన్ క్రీడాకారులు ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. మహిళా విద్యార్థులకు కేవలం మహిళా టీచర్లు మాత్రమే క్లాసులు చెబుతారు. కో ఎడ్యుకేషన్ అనేది తీసేశారు. మహిళలు తప్పనిసరిగా బుర్ఖాను ధరించాలని
తాలిబాన్లు వెల్లడించారు.