తెలంగాణలో పలువురు IPS లకు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక పోస్టింగులు ఇచ్చింది. హైదరాబాద్ పరిపాలనా విభాగం సంయుక్త కార్యదర్శిగా రమేశ్‌రెడ్డి, హైదరాబాద్ మధ్య మండల డీసీపీగా రాజేశ్ చంద్ర, హైదరాబాద్ దక్షిణ మండల డీసీపీగా సాయి చైతన్య, హైదరాబాద్ తూర్పు మండల డీసీపీగా సతీశ్లను నియమించింది. మరోవైపు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
https://twitter.com/DDNewsAndhra