బీజేపీ కక్ష సాధింపు రాజకీయానికి అంతిమ ఘడియలు: టీపీసీసీ రేవంత్ రెడ్డి

0
98

తెలంగాణ: ఖైరతాబాద్ లో కాంగ్రెస్ చలో రాజ్ భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు కొనసాగిస్తోంది.  రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు బొల్లారం పీఎస్ కు తరలించారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులను రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

ఈడీ ముసుగులో బీజేపీ కక్ష సాధింపు రాజకీయానికి అంతిమ ఘడియలు మొదలయ్యాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలను అక్రమ కేసులతో వేధించడాన్ని నిరసిస్తూ రెండు రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నాం. తాజా రాజ్ భవన్ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణుల సహనానికి ప్రభుత్వాలు పరీక్షపెడుతున్నాయి. మా కార్యకర్తలు, నాయకుల పై విచాక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు.

ఆడబిడ్డలు అని కూడా చూడకుండా మహిళా నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. బీజేపీకి వత్తాసుగా కేసీఆర్ ప్రభుత్వం మా శ్రేణుల పైకి ఖాకీలను ఉసికొల్పింది. ఐనా, పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం… రాష్ట్రంలో , దేశంలో నియంత పాలన అంతానికి కాంగ్రెస్ కదం తొక్కుతుంది. మా కార్యకర్తలు, నాయకుల పై లాఠీ ఛార్జ్ ను, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని రేవంత్ తెలిపారు.