తేడా వ‌స్తే లేపేస్తా– మ‌రో వివాదంలో టీడీపీ నేత కూన‌

తేడా వ‌స్తే లేపేస్తా-- మ‌రో వివాదంలో టీడీపీ నేత కూన‌

0
102

శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత‌ల గురించి ఇప్పుడు వార్త‌లు బాగా వినిపిస్తున్నాయి అంటున్నారు రాజ‌కీయ నేత‌లు, ముఖ్యంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడి వ్య‌వ‌హారం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశమైంది.
ఇక శ్రీకాకుళం జిల్లా టీడీపీ సీనియర్ నేత మాజీ చీఫ్ విప్‌ కూన రవికుమార్ కూడా ఈ మ‌ధ్య వార్త‌ల్లో వినిపిస్తున్నారు.

తాజాగా, మరో వివాదం ఆయనను వెంటాడింది. పొందూరు మండలానికి చెందిన వైసీపీ నేత గుడ్ల మోహన్‌ను ఫోన్‌ల్లో బెదిరించారు కూన.. సోష‌ల్ మీడియాలో ఆ ఆడియో వైర‌ల్ అవుతోంది…గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో గుడ్ల మోహన్ టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోయారు..

ఆయన బిల్డింగ్‌లోనే పొందూరు టీడీపీ కార్యాలయం ఉంది.. టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించాలని
గుడ్ల మోహన్‌కు వైసీపీ నుంచి ఒత్తిళ్లు ఉండడంతో కూన రవికి ఫోన్ చేసి ఖాళీ చేయాల్సిందిగా కోరారు.. తాను ఖాళీ చేయ‌ను అని ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు కూన‌.

ఇక ఆగ్రహంతో ఊగిపోయిన కూన రవికుమార్.. నీగురించి ఆలోచించేది ఏంటి? మర్యాదగా ప్రవర్తించకపోతే .. మర్యాద తప్పాల్సి వస్తుందంటూ మండిపడ్డారు.. తేడా వస్తే లేపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్ప‌టికే ప‌లు కేసులు ఉంటే, కూన మ‌రో వివాదంలో చిక్కుకున్నాడు అని తెలుగుదేశం నేత‌లు డైల‌మాలో ఉన్నారు.