తేల్చుకుందామంటే రెడీ…పవన్

తేల్చుకుందామంటే రెడీ...పవన్

0
65
Pawan Kalyan Jana Sena

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పాలనను కూల్చి వేతతో స్టార్ట్ చేసిందని అన్నారు… భవన నిర్మాణ కార్మికులను కూల్చి వేసిందని ఇప్పుడు రైతులను కూడా కూల్చి వేస్తోందని పవన్ మండిపడ్డారు…

రైతు సౌభాగ్య ధీక్ష విరమించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి శనివారం ఆదివారం సెలవులు ఉంటాయని అలాగే తనను తిట్టే ఎమ్మెల్యేలకు సెలవులు ఉంటాయని కానీ రైతులకు సెలవులు ఉండవలని ఆరోపించారు….

తనకు సూటుకేసుల కంపెనీ లేదని అలాగే కాంట్రాక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవని అన్నారు… తనకు తెలిసింది ఒక్కటే అని అది సినిమాల్లో నటించడం అని అన్నారు…, సినిమా నచ్చితి ప్రేక్షకులు ఆదరిస్తారని నచ్చకపోతే ప్రేక్షకులు పక్కనబెడతారని అన్నారు….

సహనంగా ఉండటమే జనసేన బలమని అన్నారు… మీరెంత మీ 150 మంది ఎమ్మెల్యేలెంత అని పవన్ ఫైర్ అయ్యారు… బాహాబాహీగా తేల్చుకుందామంటే రెడీ అని అన్నారు… తనకు ప్రాణం మీద ఆశలేదని అన్నారు…