Flash: ఇవే నా చివరి మాటలు..ఉక్రెయిన్​ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

0
85

9 రోజులు గడిచిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుంది. తాజాగా ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా చట్టసభ్యులతో వీడియో కాల్​లో మాట్లాడిన జెలెన్​స్కీ ఇవే తన చివరి మాటలు కావొచ్చంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. తాను రాజధాని కీవ్‌లోనే ఉన్నానని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అలాగే తమ గగనతలాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని నాటోను మరోసారి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్యాన్ని వదులుకునేందుకు ఉక్రెనియన్లు సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు.