‘ప్రభాస్ రాధేశ్యామ్​’ ఫస్ట్​ రివ్యూ..ఊహలకు అందని విధంగా సినిమా!

0
33

డార్లింగ్ ప్రభాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తాజాగా ‘రాధేశ్యామ్​’ సినిమాను వీక్షించిన సెన్సార్​ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్​ సంధు ఫస్ట్​రివ్యూ ఇచ్చారు. సినిమా అద్భతంగా ఉందని, ఇక ఈ చిత్ర క్లైమాక్స్​ అంచనాలకు అందనంత గొప్పగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

“ప్రభాస్​ క్లాస్​, స్టైల్​ను భారత్​లో ఎవరూ బీట్​ చేయలేరు. రాధేశ్యామ్​లో ఎంతో అందంగా ఉన్నారు. ఆయన నటన ఎంతో అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో వీఎఫ్​ఎక్స్​ కళ్లు చెదిరేలా ఉన్నాయి. ప్రభాస్​, పూజాహెగ్డే కెమిస్ట్రీ మైండ్​ బ్లోయింగ్​. ఇది అద్భుతమైన సినిమా. ఇక క్లైమాక్స్​ ఓ అద్భుతమైన అనుభూతి. ఎవరూ ఊహించనంతగా ఉంది. సినిమాకే హైలెట్​గా నిలుస్తుంది. మాటల్లో చెప్పలేను అంటూ ఉమైర్​ సంధు ట్వీట్ చేశారు.