నేడు ప్రధాని మోడీ షెడ్యూల్ వివరాలు ఇవే..

0
119

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఇటు ప్రధాని మోడీ బహిరంగసభతో భాగ్యనగరం కాశాయమయంగా మారింది. ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న మోడీ పర్యటన హైదరాబాద్‌లో కొనసాగనుంది.

ప్రధాని మోడీ పర్యటన వివరాలు ఇలా..

నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.

ఈ సమావేశం సాయంత్రం 4:30 వరకూ కొనసాగనుంది.

4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్‌.. సాయంత్రం 6.30 గంటలకు రోడ్డు మార్గంలో మోదీ పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుంటారు.

సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకూ జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.

రాత్రికి రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీ బస చేస్తారు.

రేపు ఉదయం 9.20 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. బేగంపేట్ నుంచి విజయవాడకు మోదీ వెళ్లనున్నారు.