కేంద్ర బడ్జెట్-2022 హైలెట్స్‌ ఇవే..

These are the highlights of the Union Budget-2022

0
119

2022-23 ఆర్దిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను ఆర్దికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఆమె 4వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

2022-23 బడ్జెట్ అంచనాలు రూ.39.45 లక్షల కోట్లు.

బడ్జెట్ ద్రవ్య లోటు 6.9 శాతం. ద్రవ్య లోటు 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యం.

ఆదాయ వనరులు రూ.22.84 లక్షల కోట్లు.

 

ఆమె ప్రసంగంలో హైలెట్స్ ఇవే..

రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు

పీఎం గృహ నిర్మాణ పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులు

జాతీయ రహదారులను 25 వేల కిలో మీటర్లకు పెంచుతాం.

100 పీఎం గతి శక్తి కార్గో టెర్మినల్స్.

దేశంలో నాలుగు ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు.

అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్‌ సేవలు. డిజిటల్‌ పేమెంట్, నెట్‌ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు

అత్యాధునిక వసతులతో కొత్త వందే భారత్ రైళ్లు. కవచ్ పథకం కింద 2 వేల కిలోమీటర్లు. 400 కొత్త జనరేషన్ వందే భారత్ రైళ్లు.

పర్వతమాల ప్రాజెక్టు కింద 8 రోప్ వేల నిర్మాణం. 60 కిలోమీటర్ల దూరంలో ఒక్కో రోప్ వే నిర్మాణం.

డ్రోన్ టెక్నాలజీని పెంచేందుకు డ్రోన్ శక్తి పథకం.

2 లక్షల అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌

ఎయిర్ ఇండియా బదిలీ సంపూర్ణంగా పూర్తయింది.

సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహకాలను అందిస్తాం.

తృణ ధాన్యాల ఉత్పత్తి, మార్కెటింగ్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.

2023ను తృణ ధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నాం.

వరి, గోధుమ మద్దతు ధర చెల్లింపులకు రూ. 2.7 లక్షల కోట్లు.

అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం

రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు పథకం.

ప్రాంతీయ భాషల్లో విద్యాభివృద్ధికి టీవీ ఛానెళ్లు.

డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్శిటీ.

వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన.

ఆత్మ నిర్భర్ భారత స్ఫూర్తితో 16 లక్షల ఉద్యోగాలను కల్పించాం.

ఎయిర్ ఇండియా బదిలీని సంపూర్ణంగా పూర్తి చేశాం.

రైల్వేలో సరకుల రవాణాకు సరికొత్త పథకం.

కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా ప్రాజెక్టులకు డీపీఆర్ సిద్ధమైంది.

బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ. ఈ ఏడాదిలోనే డిజిటల్ కరెన్సీ.

అత్యాధునిక టెక్నాలజీతో చిప్ ఉన్న ఈ-పాస్ పోర్టులు.

8 ప్రాంతీయ భాషల్లో ల్యాండ్ రికార్డులు.

కరోనా వల్ల విద్యను కోల్పోయిన విద్యార్థుల కోసం వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్.

2022-23లో 5జీ సేవలను ప్రైవేట్ టెలికాం సంస్థలు అందుబాటులోకి తీసుకొస్తాయి.

2025 కల్లా భారత్ ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఆప్టికల్ ఫైబర్ సౌకర్యం.

అన్ని పోస్టాఫీసులను కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ తో అనుసంధానం చేస్తాం.

రక్షణ రంగానికి కావాల్సిన వాటిని 68 శాతం దేశీయ పరిశ్రమల నుంచే సమకూర్చుకుంటాం.

రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం.

పురుగు మందుల వినియోగం కోసం డ్రోన్ల సహకారం.

యానిమేషన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.

ఐదు నదులకు చెందిన ప్రాజెక్టుల నీటి పంపకాలకు డీపీఆర్ సిద్ధమైంది.

రూ. 44,605 కోట్లతో కేన్-బేట్వా నదుల అనుసంధానం.

ఎంఎస్ఎంఈలకు లోన్లు ఇచ్చేందుకు నిధులను మరో 2 లక్షల కోట్లను పెంచుతున్నాం.

ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ది క్షేత్రాల ఏర్పాటు.

కొత్తగా 75 జిల్లాల్లో డిజిటల్ బ్యాంకులు ఏర్పాటు.

డిజిటల్ పేమెంట్, నెట్ బ్యాంకింగ్ సేవలకు మరింత ప్రోత్సాహకం.

ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులను పెంచుతున్నాం.

డిజిటల్ పేమెంట్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు. కమర్షియల్ బ్యాంకుల ద్వారా 75 జిల్లాల్లో 75 యూనిట్ల ఏర్పాటు.

ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ.

అన్ని మంత్రిత్వ శాఖల్లో కాగిత రహిత వ్యవస్థను తీసుకొస్తాం.

బొగ్గును రసాయనంగా మార్చేందుకు ప్రత్యేక పథకం.

విద్యుత్ వాహనాల పెంపులో భాగంగా బ్యాటరీల తయారీకి ప్రోత్సాహకాలు.

పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణా పై అధ్యయనం కోసం రూ.250 కోట్లతో 5 విద్యా సంస్థల ఏర్పాటు.

ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో భాగంగా ఒక రిజిస్ట్రేషన్-ఒక దేశం.

సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ.19,500 కోట్లు కేటాయింపు.

ఎగుమతుల ప్రోత్సాహాకానికి కొత్త చట్టం.

దేశంలో కొత్తగా డిజిటల్ యూనివర్సిటి.

4 ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్కులు.

స్టార్టప్ ల కోసం రూ.2 లక్షల కోట్లు.

త్వరలో నదుల అనుసంధానం.

మైక్రో, చిన్న తరహా పరిశ్రమలకు రూ.2 లక్షల కోట్లు కేటాయింపు.

క్రెడిట్ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్లు.

పీఎం ఈ విద్య కోసం 200 ఛానళ్ల ఏర్పాటు.

మేకిన్ ఇండియా పథకంలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పన.

వేగంగా అభివృద్ది ప్రధానమంత్రి గతిశక్తి పథకం.

వంట నూనె దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు చర్యలు.

నిరాశ, నిస్పృహాలో ఉన్న వారి కోసం టెలీ హెల్త్ మెడికల్ సెంటర్లు.