తెలంగాణలోని నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30,453 ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శాఖల వారిగా పోస్టులను వెల్లడించింది. వైద్య, ఆరోగ్యసేవల నియామక బోర్డు ద్వారా 10 వేల 28 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
వైద్యశాఖలో నోటిఫికేషన్ విడుదల చేసే పోస్టులు ఇవే..
ఎంపీహెచ్ఏ మహిళ-1520, వైద్యవిద్య అసిస్టెంట్ ప్రొఫెసర్-1,183, వైద్యవిద్య స్టాఫ్‌నర్స్- 3,823, వైద్యవిద్య ట్యూటర్- 357 పోస్టులు ఉన్నాయి. ప్రజారోగ్య సివిల్ అసిస్టెంట్ సర్జన్-751 ఖాళీలు భర్తీ చేస్తారు. వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్-1,284, వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎం -265, వైద్య విధాన పరిషత్ స్టాఫ్ నర్సు- 757 పోస్టులు ఉన్నాయి.
అలాగే శాఖాపరమైన ఎంపిక కమిటీ ద్వారా నిమ్స్‌లో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తారు. టీఎస్పీఎస్సీ ద్వారా వైద్య, ఆరోగ్యశాఖలో 2,662 పోస్టుల నియామకాలు చేపట్టనున్నారు. అనుమతించిన పోస్టుల భర్తీకి సంబంధించి నియామక సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలన్న ఆర్థికశాఖ… రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ సహా అన్ని వివరాలను అందించాలని ఆయా శాఖలకు స్పష్టం చేసింది.