సుకన్య సమృద్ధి యోజన గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

0
71

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో సుకన్య సమృద్ధి పథకం ఒకటి. ఈ పథకం ద్వారా అమ్మాయిల భవిష్యత్తు కోసం డబ్బులను పొదుపు చేయవచ్చు. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయి పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బ్యాంకు/పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు.

ఈ ఖాతాను పోస్టాఫీసు లేదా పబ్లిక్/ప్రైవేట్ రంగ బ్యాంకులో సుకన్య సమృద్ధి యోజన దరఖాస్తు ఫారం పూర్తి చేసి ఇవ్వవచ్చు. ధరఖాస్తు ఫారమ్‌తో పాటు తల్లిదండ్రుల/సంరక్షకుల ఆధార్, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, ఓటరు ఐడీ ఏదైనా ఒక గుర్తింపు పత్రాన్ని కేవైసీగా సమర్పించాలి. అమ్మాయి జనన ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీని సమర్పించాలి.

ఇకపోతే ఈ జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేటు సంవత్సరానికి 7.60%గా నిర్ణయించారు. ఇది ఇతర ప్రభుత్వ పొదుపు పథకాల వడ్డీ రేట్ల కన్నా కూడా ఎక్కువే..అధిక వడ్డీ రేటుతో పాటు సెక్షన్ 80సీ కింద సంవత్సరానికి రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా ఉంది.ఇకపోతే సంవత్సరానికి కనీసం రూ. 250 డిపాజిట్ చేయవచ్చు. గరిష్ట డిపాజిట్ పరిమితి ఏడాదికి రూ. 1.50 లక్షలు. అయితే, ప్రతి ఏడాది కనీసం రూ. 250 మదుపు చేయడం తప్పనిసరి..