ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లా కంచుకోట… పార్టీ స్థాపించినప్పటినుంచి ఇక్కడ టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటునే ఉంది… తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ జిల్లా వ్యాప్తంగా మెజార్టీ స్థానాలను గెలుచుకుని పసుపు జెండాను రెపరెపలాడించింది..
అయితే 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి సునామితో సైకిల్ కృష్ణానదిలో కొట్టుకుపోయింది… ఈ జిల్లాలో జగన్ చిరిత్రను తిరగ రాశారు… గడిచిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకుని వైసీపీ జెండాపాతారు… దీంతో తమ్ముళ్లు కూడా ఆలోచనలో పడ్డారట… ఏపీలో టీడీపీ పుంజుకోవాలంటే కనీసం 20 ఏళ్లు పడుతుందనే ఉద్దేశంతో ఎవరి దారి వారు చుసుకుంటున్నారు..
ఇప్పటికే చాలామంది టీడీపీనేతలు వైసీపీలో చేరారు… ఇక కరోనా పూర్తి అయిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని మరికొందరు టీడీపీకి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట… దీంతో ఈ జిల్లాల్లో పలు చోట్ల టీడీపీకి టులెట్ బోర్డ్ పెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ మేధావులు అంటున్నారు…