అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి… ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటు రచ్చకెక్కుతున్నారు… ఇదే క్రమంలో వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై ఫైర్ అయ్యారు… ఇటీవలే డిప్యూటీ సీఎం అలాగే సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లాకలెక్టర్ గుప్తా పుత్తురులో పర్యటించారు..
దళితులకు కళ్యాణమంటపం స్థల సేకరణ కోసం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఖాళీ భూమినీ పరిశీలించారు… అయితే ఈ పర్యటనకు ఎమ్మెల్యే రోజాను పిలువలేదు… దీంతో ఆమె ఆగ్రహం చెందారు…
తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గం అయిన నగరిలో నారాయణ స్వామి పర్యటించారని రోజా మండిపడ్డారు… నియోజకవర్గంలో తాను అందుబాటులో ఉన్నాకూడా తనకు సమాచారం ఇవ్వలేదని ఆమె ఫైర్ అయ్యారు…