బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర-4 షెడ్యూల్ ఇదే..

0
127

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూడు దఫాలుగా ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టారు. కాగా ఇప్పుడు మరోసారి నాలుగో విడత యాత్రకు బండి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మాల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు.

 

అయితే విజయదశమి నవరాత్రుల నేపథ్యంలో ఈసారి యాత్రను పది రోజులకే కుదించారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగనంది.

రేపటి నుంచి 22వ తేదీ వరకు 10 రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈనెల 12న కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని చిట్టారమ్మ ఆలయం వద్ద ఉదయం 10:30 గంటలకు బండి సంజయ్ ప్రత్యేక పూజలను నిర్వహించి పాదయాత్రను ప్రారంభిస్తారు.