ఈ సెగ్మెంట్ లో టీడీపీ ఆఫీస్ కు తాళం

ఈ సెగ్మెంట్ లో టీడీపీ ఆఫీస్ కు తాళం

0
82

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ ఆపీస్ కు తాళం పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు బలమైన నేతగా ఉన్నఇద్దరు నేతలు ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పారు… ఇక మిగిలిన నాయకులు ఉన్నా కూడా వారు తృతియ నాయకులని పార్టీని ముందుకు నడిపించే సత్తాలేదని చర్చించుకుంటున్నారు…

జమ్మలమడుగులోమాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీ సీనియర్ నేత ఎప్పటినుంచో టీడీపీని నమ్ముకుని పని చేశారు… 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు… ఇటీవలే ఆయన కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు…

ఇక కీలక నేతగా ఉన్న ఆధినారాయణ రెడ్డి కూడా గతంలో బీజేపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే ఇటీవలే రామసుబ్బారెడ్డి కూడా టీడీపీ కి గుడ్ బై చెప్పారు.. దీంతో ఇప్పుడు జమ్మలమడుగులో టీడీపీ ఖాళీ అని చర్చించుకుంటున్నారు…