వైసీపీలోకి ఆ కీలకనేత చేరికతో అక్కడ టీడీపీ ఖాళీ

వైసీపీలోకి ఆ కీలకనేత చేరికతో అక్కడ టీడీపీ ఖాళీ

0
105

2019 ఎన్నికల్లో తెలుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే.. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కోవడంతో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పార్టీని ఓ దారిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

70 ఏళ్లు పైబడిన వయస్సులో కూడా చలో ఆత్మకూరు అనే నినాదానికి పిలుపునిచ్చారు. కానీ పార్టీలో అసంతృప్తి జ్వాలలు మాత్రం అలానే ఉన్నాయి.. ఈ అసంతృప్తితో ఇప్పటికే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఇదే క్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక అనుచరుడు కమలాకర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురు కీలక నేతలు కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు… ప్రస్తుతం టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకత విధానాలతో ఆయన వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది…

నెల్లూరు జిల్లాకు కీలక నేతగా వ్యవహరిస్తున్న కమలాకర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ తీర్ధం తీసుకోవడం వల్ల అక్కడ టీడీపీ దాదాపు ఖాళీ అయినట్లేనని అంటున్నారు