టీడీపీకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గుడ్ బై

టీడీపీకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గుడ్ బై

0
100

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జంపింగ్ జపాంగ్ లు భయం పెరుగుతోంది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పారు. అయితే బాబుకు వినయ విధేయుడు అయిన వంశీ రాజీనామాతో కొందరు సీనియర్లు కూడా ఆశ్చర్యపోయారు, ఈ సమయంలో మరికొందరు గోడ దూకేందుకు సిద్దంగా ఉన్నారట. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఓ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారు అని తెలుస్తోంది.

చంద్రబాబు దగ్గర ఇప్పుడు కేవలం 22 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు.. ఇందులో ఓ ఐదుగురు కచ్చితంగా బాబు వెంటే ఉంటారు. మిగిలిన వారిలో ఎవరు గోడ దూకే నేతలో అర్దం కావడం లేదట టీడీపీ కోటరీలో, అయితే ఇప్పటికే కొందరు తెలుగుదేశం నేతలతో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారట, అవి సఫలం అయితే వారు కూడా వంశీ దారిలో టీడీపీకి గుడ్ బై చెబుతారు అని తెలుస్తోంది.

అయితే మరికొందరు మాత్రం తాము రాజీనామా చేయకుండా తటస్థంగా ఉంటాము అని చెబుతున్నారట. దీంతో ఇది పక్కాగా ఫిరాయింపు ఖాతాకే వస్తుంది కాబట్టి జగన్ దీనికి ఒఫ్పుకోవడం లేదు.. అయితే బాబు మాత్రం జిల్లా నేతలతో ఫోన్లో మాట్లాడి పార్టీ కార్యక్రమాలకు యాక్టీవ్ గా లేని ఎమ్మెల్యేలు ఎవరో తెలుసుకుంటున్నారట. మొత్తానికి ఈ ఏడాదిలో టీడీపీకి రాజీనామాల హోరు, వైసీపీకి టీడీపీకి ఉప ఎన్నిక పోరు తప్పదు అంటున్నారు విశ్లేషకులు