మూడు రాజధానులు ముగ్గురు పెళ్లాలు వైసీపీ జనసేనాకి షాక్

మూడు రాజధానులు ముగ్గురు పెళ్లాలు వైసీపీ జనసేనాకి షాక్

0
100

ఏపీలో మూడు రాజధానుల ప్రకటన కాక రేపుతోంది.. మొత్తానికి దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వరుసగా ట్వీట్లు పెట్టి సర్కారుని విమర్శించారు.. ఇక చంద్రబాబు టీడీపీనేతలు ఇది తుగ్లక్ చర్య అని విమర్శించారు. తాజాగా పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి కట్టడానికే దిక్కులేదు, ఇంకా మూడు రాజధానులు కావాల్సి వచ్చాయా? అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సటైర్ వేశారు.

పవన్ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, జగన్ ఏ విషయం అయితే చెప్పారో అది ఆయన వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు అని విమర్శించారు. జగన్ కేవలం ఏపీకి మూడు రాజధానులు అని చెప్పారు మరి ఇది పవన్ కు ఎలా అర్దం అయిందో తెలియడం లేదు అని సటైర్ వేశారు.

మూడు రాజధానులు ఉంటే తప్పేమీ లేదు, ముగ్గురు పెళ్లాలు ఉంటే తప్పు అంటూ పవన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పవన్ ఒకే వ్యాఖ్యలు చేస్తారు కాని వాదన వేరుగా ఉంటుంది అని విమర్శించారు.. ఇక ఇద్దరికి సోషల్ మీడియాలో ట్విట్టర్ ఖాతాలు ఒకరే నడుపుతున్నట్లు తెలుస్తోంది అని విమర్శించారు.