మూడు రాజధానులపై జగన్ మరోసారి కీలక కామెంట్స్

మూడు రాజధానులపై జగన్ మరోసారి కీలక కామెంట్స్

0
81

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు… తమ పరిపాలనలో అందరికీ సమానంగా ప్రభుత్వ ఫలాలు అందాలని అన్నారు…

ఆ ప్రతిపాదనపైనే ప్రతి నిర్ణయం తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు… గ్రామాలనుంచి రాష్ట్ర పాలన వరకు అందరూ సమానమే అని అన్నారు… నీళ్లు నిధులు పరిపాలన అభివృద్ది ఫలాలు సమానంగా అందరికీ వస్తేనే న్యాయం జరుగుతుందని జగన్ అన్నారు…

గతంలో నిర్ణయాలన్ని అన్యాయంగా జరిగాయని అన్నారు… అందుకే తాము ప్రతీ ఒక్కరికి సమానంగా న్యాయం చేస్తామని అన్నారు జగన్… కాగా ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ఏపీలో మూడు రాజధానులు రావచ్చని చెప్పిన సంగతి తెలిసిందే… కర్నూల్ విశాఖ అమరావతిలో మూడు రాజధానులు రావచ్చని చెప్పారు…