మూడు రాజధానులపై పవన్ సంచలన కామెంట్స్

మూడు రాజధానులపై పవన్ సంచలన కామెంట్స్

0
86

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేసిన సంగతి తెలిసిందే. శీతాకాల సమావేశంలో రాజధానిపై చర్చరిగింది… ఈ చర్చలో జగన్ మాట్లాడుతూ…. సౌత్ ఆఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని అన్నారు…

బహుషా ఏపీలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అంటూ ప్రసంగించారు… అమరావతిలో లెజిస్లేటర్ క్యాపిటల్ రావచ్చు, విశాఖ పట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావచ్చు, కర్నూల్ జిల్లాలో జుడిషియల్ క్యాపిటల్ రావచ్చని జగన్ అన్నారు… దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు ఒక రాజధానికే దిక్కులేదని అనుకుంటుంటే మూడు రాజధానులు ఎలాసాధ్యంఅని ప్రశ్నించారు…

అమరావతిలో పరిపాలన ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇప్పుడిప్పుడే రాజధాని ప్రాంతానికి అలవాటుపడుతున్నారు. వారి పిల్లల్లు కూడా రాజధాని ప్రాంతంలో విద్యాలయాల్లో చేరారు. వాళ్ళని మళ్ళీ ఎగ్జిక్యూటివ్ రాజధాని అని మరోచోటికి వెళ్లిపోమంటే ఎలా అని ప్రశ్నించారు

రాజధాని మార్పు అంటే ఆఫీసు ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం కాదు. కొన్ని వేల జీవితాలను బలవంతంగా తరలించడమే. వారికయ్యే వ్యయప్రయాసలకి బాధ్యత ఎవరు తీసుకుంటారని పవన్ ప్రశ్నించారు..

‘‘తినటానికి మెతుకులు లేక ఏడుస్తుంటే కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. ఒక అమరావతి రాజధానికే దిక్కు లేదు. జగన్‌రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అయ్యేనా?. పాలకులు తీరుతో రాష్ట్ర విభజన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఏపీ ప్రజలకు అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఇంకేమీ లేదు.’’ అని ట్విట్టర్‌లో పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు.