టిక్ టాక్ కు యూట్యూబ్ షాక్ ఇవ్వనుందా ? కొత్త ఆవిష్కరణ

టిక్ టాక్ కు యూట్యూబ్ షాక్ ఇవ్వనుందా ? కొత్త ఆవిష్కరణ

0
102

చైనా నుంచి ఇప్పుడు ఏ వస్తువులు కొనద్దు అని… బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ అని పెద్ద ఎత్తున నినాదాలు విమర్శలు వస్తున్నాయి, ఈ సమయంలో చాలా వరకూ చైనా యాప్స్ పై కూడా ఇది ప్రభావం చూపిస్తోంది.
ఈ సమయంలో యూట్యూబ్ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు కొత్త ఫీచర్తో వస్తోంది.

టిక్ టాక్ లాంటిదే ఫీచర్ ను యూ ట్యూబ్ లో త్వరలో లాంచ్ చేయనున్నారు..గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్ఫాం క్రొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండిండిలోనూ దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు యూట్యూబ్ వెల్లడించింది.

ఇక కేవలం 15 సెకన్ల నిడివితో వీటిని పోస్ట్ చేయడానికి అనుమతి ఉండనుంది.. ఒకేసారి ఎక్కువ వీడియోలను అప్లోడ్ చేయాలనుకుంటే, ఫోన్ గ్యాలరీ నుండి నేరుగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ముందు టిక్ టాక్ లో ఉన్నన్ని ఫీచర్లు లేకపోయినా డవలప్మెంట్ – ఆర్ అండ్ వర్క్ జరుగుతుంది కాబట్టి అన్నీ పూర్తి అవుతాయి అని అంటున్నారు అనలిస్టులు.