టిక్ టాక్ ను కొనేందుకు రేసులోకి మ‌రో కంపెనీ

టిక్ టాక్ ను కొనేందుకు రేసులోకి మ‌రో కంపెనీ

0
117

చైనాకు చెందిన షార్ట్ వీడియో మొబైల్ అప్లికేషన్ టిక్ టాక్ ను కొనుగోలు చేయాలి అనే ఆస‌క్తి చాలా దిగ్గజ కంపెనీల‌కు ఉంది, దీంతో చాలా కంపెనీలు ముందుకు వ‌స్తున్నాయి, ఇప్ప‌టికే ట్విట‌ర్, మైక్రోసాఫ్ట్ రిల‌య‌న్స్ పేర్లు వినిపిస్తున్నాయి, తాజాగా ఈ రేసులో మ‌రో కంపెనీ ముందుకు వ‌చ్చింది.

వాల్ మార్ట్ కూడా టిక్ టాక్ పై కన్నేసిందని తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్‌తో కలిసి కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నామని వాల్‌ మార్ట్‌ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్‌, టిక్‌ టాక్‌తో చేసుకోనున్న ఈ ఒప్పందం తమ అడ్వర్టైజింగ్‌ వ్యాపారాన్ని మరింత విస్తృతపరిచేందుకు దోహదం చేస్తుందని వాల్ మార్ట్ తెలిపింది.

అయితే దీనిపై ఇంకా టిక్ టాక్ స్పందించ‌లేదు. టిక్ టాక్ అమెరికా పౌరుల సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందంటూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ టిక్ టాక్‌ను నిషేదిస్తాము అని ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే, ఇక దీనికి స‌మ‌యం ఇచ్చారు సెప్టెంబ‌ర్ 15 లోపు దీనిపై నిర్ణ‌యం తీసుకోవాలి. చూడాలి ఈ 15 రోజుల్లో ఏ కంపెనీ దీనిని చేజిక్కించుకుంటుందో.