వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆవిర్బావం నుంచి అంతా లోటస్ పాండ్ లోనే తన పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లారు పార్టీ మీటింగులు భేటీలు అన్నీ తన నివాసంలో చేశారు.. పార్టీ కార్యలయం లోటస్ పాండ్ లో ఉంది.. అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా ఆయన్ని పెద్దఎత్తున విమర్శలు చేశారు.. ఆయన హైదరాబాద్ లోనే ఉంటూ ఏపీ రాజకీయాలు చేస్తారు అని విమర్శించారు. ఇక ఇలాంటి విమర్శలకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా ఎన్నికల ఫలితాల వెల్లడికి రెండ్రోజుల ముందు ఆయన లోటస్ పాండ్ నుంచి తాడేపల్లిలోని కొత్తింటికి మారబోతున్నారు. ఫిబ్రవరి 27న జగన్ గృహ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన తన మకాం మార్చుతున్నారు అని పక్కా సమాచారం. . ఇప్పటికే లోటస్ పాండ్ లో ఉన్న పార్టీ ఆఫీసుకు సంబంధించిన ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర మెటీరియల్ను లోటస్ పాండ్ నుంచి తాడేపల్లికి తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇక రెండు రోజుల్లో అన్నీ అక్కడ చేరుతాయి, అసంబుల్డ్ చేస్తారు అని తెలుస్తోంది. ఇక పులివెందులకు జగన్ నేడు వెళ్లనున్నారు.
మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడి అవ్వనున్నాయి.. ఈలోపు రెండు రోజుల ముందే ఆయన అక్కడ నుంచి రాజకీయంగా తన పార్టీ కార్యక్రమాలు మీటింగులు ఏర్పాటు చేయనున్నారు.