వాళ్లు దొంగ ఎమ్మెల్యేలు, కేసిఆర్ దొంగల ముఠా నేత

0
87

తెలంగాణ సిఎం కేసిఆర్ పై టిపిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దొంగ ఎమ్మెల్యేలను పంచనచేర్చుకున్న దొంగల ముఠా నాయకుడు చంద్రశేఖర్ రావును గద్దె దింపాల్సిన అవసరముందని మధుయాష్కీ గౌడ్ అన్నారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు క్రాస్ రోడ్డులో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుదలకు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఎడ్లబండిపై వచ్చి ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అలిబాబా చాలిస్ చోర్ లా దోచుకుంటున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని ఈ ప్రభుత్వాలను గద్దె దించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాన్యుల పార్టీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి దొంగలను తన పంచన చేర్చుకున్న ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావును బడా చోర్ అని విమర్శించారు. కాంగ్రెస్ దొంగలను పంచచేర్చుకున్న దొంగల ముఠా నాయకుడు చంద్రశేఖర్ రావును గద్దె దింపాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్ల నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి,కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి రాంరెడ్డి, బెల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.