పిసిసి చీఫ్ బాధ్యతలు ఎప్పుడు చేపడతానంటే : రేవంత్ రెడ్డి క్లారిటీ

0
115

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ శనివారం పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పిసిసి చీఫ్ గా బాధ్యతలు ఎప్పటి నుంచి తీసుకుంటారు?, తన భవిష్యత్ కార్యాచరణ ఏంటి? కార్యకర్తలను ఎలా ముందుకు నడుపుతారు… తదితర అంశాలపై ఆదివారం మీడియాతో చాట్ చాట్ చేశారు. ఆయన ఏమన్నారో చదవండి.

జులై 7 న మధ్యాహ్నం 1 గంట 30 నిముషాలకు పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటాను. రాష్ట్రంలో ఎంఐఎం బలం ఎంతో బిజెపి బలం కూడా అంతే. టిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతముగా బలంగా ఉంది. బీజేపీ అయోధ్య భూముల వ్యవహారంలో రాముడిని కూడా తెగనమ్ముకున్నది. రాముడి పేరు తీసుకోవడానికి బిజెపి నాయకులకు అర్హత లేదు. మోదీ ఇప్పుడు గడ్డం పెంచి సన్యాసి అవతారం ఎత్తారు.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. నేను ఒక్కడినే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. సమిష్టి నిర్ణయాలు మాత్రమే ఉంటాయి. తెలంగాణ లో ప్రజల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంది.

అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు నా పాదయాత్ర ఉండే అవకాశం ఉంది. అది ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే దానిపై క్లారిటీ ఇస్తాము. ఇపుడున్న పరిస్థితులలో ఎన్టీఆర్, వైఎస్సార్ లను విమర్శించడము వికృతమైన చర్య. చనిపోయిన వారిని అడ్డమైన భాషలో తిట్టడం వల్ల మన సంస్కారం తగ్గుతుందే తప్ప పెరగదు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను అండగా ఉంటా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ఇప్పడు తిరుగుబాటుగా మరాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.

టిఆర్ఎస్,బిజెపి కలసి పోటీ చేసిన లింగోజి గూడలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. లింగోజి గూడ వ్యవహారంలో ప్రగతి భవన్ వెళ్లినదుకు బిజెపి కమిటీ ఇచ్చిన నివేదికపై ఏ చర్యలు తీసుకున్నారు ? ఎప్పటి లోగా చర్యలు తీసుకుంటారు ? బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.

రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.

 

ఈ వార్త కూడా చదవండి…

రేవంత్ రెడ్డిపై కత్తి దూసిన కోమటిరెడ్డి : ఎయిర్ పోర్ట్ లో దిగగానే సీరియస్ కామెంట్స్