కోకాపేట భూముల్లో వెయ్యి కోట్ల అవినీతి : రేవంత్ రెడ్డి

Tpcc Chief Revanth Reddy Comments on koktapet lands auction

0
120

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కోకాపేట భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. శనివారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే చదవండి…

కేసీఆర్ బినామీ ల కోసమే భూముల అమ్మకాలు జరిగాయి. HMDA అమ్మిన భూములు కోకాపేట గ్రామంలో ఉన్నాయి. గతంలో కూడా రియల్ భూమ్ పెరినట్లు ప్రచారం చేశారు. రియల్ భూమ్ కోసమే అమ్ముతున్నట్లు ఉంది. ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్ లో స్మశానల కోసం స్థలం ఉండదు.

ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మడానికి వెళ్తే కేసీఆర్-హరీష్ రావు- కేటీఆర్ అడ్డుకొని నానా రచ్చ చేశారు. ఈ- ఆక్షన్ లో కేసీఆర్ బినామీ కంపెనీలే భూములు దక్కించుకున్నాయి. రామేశ్వర్ రావు కంపెనీలు 18 ఎకరాలు కొన్నాయి. సిద్దిపేట కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి సంస్థ రాజ్ పుష్ప 7 ఎకరాలు కొన్నది. ఆక్వా స్పెస్ సంస్థకు 390 కోట్లు- రాజ్ పుష్ప సంస్థకు 138 కోట్లు లాభం గడించాయి. 3వేల కోట్లు రావాల్సిన భూములను- 2వేల కోట్లకే పరిమితం చేశారు. ప్రెస్టీజ్ సంస్థకు – మంత్రి కేటీఆర్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయి. సోమేశ్ కుమార్- కేటీఆర్ లంచాలు తీసుకోని భూముల గోల్ మాల్ చేశారు. 50 ఎకరాలు ఉన్న భూమికి ఒక్కో రేటు ఎలా ఉంటుంది? ఒకే గ్రామంలో ఉన్న ఒక్క ఎకరాకు 60 కోట్లు- మిగిలిన 48 ఎకరాలు 30 నుంచి 40 కోట్లకు ఎలా ధర పలుకుతుంది. మిగతా వాళ్ళు ఎవ్వరూ టెండర్లు వేయకుండా సిద్దిపేట కలెక్టర్ ఫోన్ చేసి బెదిరించారు.

టెండర్లు వేస్తే ప్రభుత్వ అనుమతులు ఇవ్వమని హెచ్చరించారు. టీఆరెస్- కేసీఆర్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీలకే భూములు అప్పజెప్పారు. కోకాపేట లో 50 కోట్లకు తక్కువ ధర లేదు. అమ్మిన భూముల్లో 50 అంతస్తుల భవనాలకు అనుమతి ఇవ్వబోతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల లూటీ జరిగింది. గతంలో లిక్కర్ మాఫియా లెక్క- ఇప్పుడు టీఆరెస్ ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు తెరలేపింది. 60 కోట్లకు అమ్మిన భూమి తప్ప మిగతా భూమినంతటికీ మళ్ళీ టెండర్లు పిలువాలి.

స్విస్ ఛాలెంజ్ విధానం ప్రకారం టెండర్లు పిలువాలి. రాజ పుష్ప సంస్థ నిబంధనలకు విరుద్ధంగా రియలేస్టేట్ వ్యాపారం చేస్తోంది. త్వరలోనే రాజ పుష్ప సంస్థ- వెంకట్రామిరెడ్డి బాగోతం బయపెడుతా. ముఖ్యమంత్రి కేసీఆర్ దోపిడీ పరాకాష్టకు చేరుకుంది. తరాల నుంచి వస్తున్న భూములను అమ్మే హక్కు కేసీఆర్ కు లేదు. దీనపై నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోతే కేంద్ర హోంమంత్రి- ప్రధానికి ఫిర్యాదు చేస్తా. కిషన్ రెడ్డి కి కూడా నా దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తా. నేను ఇచ్చే ఫిర్యాదు పై కేంద్రం- బీజేపీ విచారణకు అదేశిస్తుందా లేదా చూద్దాం. టీఆరెస్- బీజేపీ రహస్య ఒప్పందం ఏంటో తెలుస్తుంది. భూ ఆక్రమణల పై పార్లమెంట్ లో మాట్లాడుతా. తెలంగాణ రాష్ట్ర విభజన పై – కృష్ణా జలాల పై పార్లమెంట్ లో పోరాటం చేస్తాం.

రియల్ ఎస్టేట్ టివి అనే యూట్యూబ్ ఛానెల్ లో ప్రసారమైన వీడియో పైన ఉంది. చూడొచ్చు.