తెలంగాణ సిఎం కేసిఆర్, ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఢిల్లీలోని ఆంధ్రా భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మధు యాష్కీగౌడ్ తో కలిసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన మాటల్లోనే చదవండి…
బిజెపి వ్యతిరేక పార్టీలతో రాహుల్ గాంధీ సమావేశం జరిపారు.
ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి కి వ్యతిరేకంగా పోరాడాలని వివిధ ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి.
రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మోడి వ్యతిరేక శక్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది . రానున్న రోజులలో మోడి వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదీజలాల పై రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసారు. ఏపి సీఎం వైఖరి వల్ల తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంది.
తెలంగాణ సీఎం నీటి వివాదాల విషయంలో ఏపీ ప్రభుత్వ అనుకూల వైఖరి అవలంబిస్తూ, కీలక సమావేశాలకు గైర్హాజరు అయ్యారు.
ఢిల్లీ మీద యుద్ధం అంటూ గతంలో ప్రకటించిన కేసీఆర్ , పార్లమెంట్ సమావేశాలలో ఒక్క రోజయినా తన పార్టీ ఎంపిలతో కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదు.
రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన సమావేశానికి గైర్హాజరు కావడం వల్ల మరోసారి నరేంద్ర మోడికి అనుకూలం అని కేసీఆర్ స్పష్టం చేసారు. కేసీఆర్ – మోడి వేరు వేరు కాదు, కవలపిల్లలు, నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారు.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు తన పాదయాత్ర ఎందుకు వాయిదా వేసుకున్నారు?
పార్లమెంట్ సమావేశాల రోజు ఎంపి జోగినపల్లి సంతోష్ ఐదుగురు రాజ్యసభ ఎంపిలతో కలసి ప్రధానిని కలిసారు. కొంత సమయం తరువాత ప్రధానితో ఎంపి సంతోష్ కుమార్ ఏకాంతంగా ఎందుకు సమావేశం అయ్యారో కేసీఆర్ సమాధానం చెప్పాలి.
ఎంపి సంతోష్ కుమార్ ప్రధానితో జరిపిన సమావేశం గురించి సీఎం కేసీఆర్ కు తెలుసా? రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మాట్లాడితే ఎందుకు బహిర్గతం చేయలేదు .
తెలంగాణ కు సంబంధించిన ఒక్క అంశం పై కూడా 15 రోజులుగా టీఆర్ఎస్ ఎంపిలు మాట్లాడలేదు. రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఎక్కడ జరిగింది ?
కేసీఆర్ తాను చేసిన ఆర్ధిక కుంభకోణాల నుండి తప్పించుకోవడానికి మోడికి గులాంగిరీ చేస్తున్నారు.
ఆగష్టు 9 నుండి కేసీఆర్ అవలంబిస్తున్న దళిత, గిరిజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేతలతో పోరాటం చేయబోతున్నాము.
కేసీఆర్ అవలంబిస్తున్న మోడీ అనుకూల విధానాల కారణంగా తెలంగాణ కు తీరని నష్టం జరుగుతుంది
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర బండి ఆగపోవడానికి కారణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారణం కాదా?
కిషన్ రెడ్డి ప్రధానితో మాట్లాడి బండి సంజయ్ పాదయాత్ర ఆపించాడు.
గవర్నర్ కోటాలో 64 కళలలో నిష్ణాతులకు ఇస్తారు కాని కోవర్టు అనే 65వ కళలో నిష్ణాతులు అయిన కౌశిక్ రెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడు. దీనిపై ఒక్క తెలంగాణ బిజెపి నేత మాట్లాడడం లేదు.