జగన్ కాన్సెప్ట్‌ అమలు చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్..కేసీఆర్ పై వర్కౌట్ అయ్యేనా?

TPCC Chief Rewanth, who is implementing Jagan Concept, got a workout on KCR?

0
107

టీపీసీసీ అధ్యక్షుని ఎన్నిక తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. పార్టీ హైకమాండ్‌ తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయనలో కొత్త ఉత్సహం కనిపిస్తోంది. పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన రేవంత్ రెడ్డి..ప్రజా క్షేత్రంలో తిరుగుతున్నారు. అలాగే సమయం దొరికినప్పుడల్లా అధికార టిఆర్ఎస్ ను, బీజేపీ పార్టీ అవినీతిని ఎండగడుతున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో మూడు రాజకీయ పార్టీల మధ్య వార్ నడుస్తుంది. తాజాగా మోదీ పార్లమెంట్‌లో రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే.

మోదీ తెలంగాణ ఉద్యమాన్ని అవమానించారని చెప్పి.. టీఆర్ఎస్ మళ్ళీ సెంటిమెంట్‌ని లేపుతూ రాజకీయం నడిపిస్తోంది.. అయితే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని మరోసారి రుజువైంది.. టీఆర్ఎస్-బీజేపీలు కుమ్మక్కు అయిపోయాయని చెప్పి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లు పోరు సాగుతుంది. అంటే ప్రతిపక్ష పాత్రలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు..కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకెళుతున్నాయి…అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ..బీజీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పని చేస్తుంది.

ఇదే సమయంలో కేసీఆర్ పని అయిపోయిందని చెప్పి రేవంత్ కామెంట్ చేస్తున్నారు. జనగామలో కేసీఆర్‌ ప్రసంగం తర్వాత.. కేసీఆర్‌ ఖేల్‌ ఖతం అన్న సంగతి అర్థమైపోయిందని, బై బై కేసీఆర్‌ అంటూ రేవంత్ ట్వీట్‌ చేశారు. అసలు తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నించిన మోదీని.. ప్రశ్నించేందుకు కేసీఆర్‌కు అంత భయమెందుకని ప్రశ్నించారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని అవమానిస్తుంటే నికార్సైన తెలంగాణ బిడ్డ ఎవరైనా పౌరుషంతో తిరగబడతారని రేవంత్ చెప్పుకొచ్చారు.

అయితే ఇక్కడ కేసీఆర్ పని అయిపోయిందని రేవంత్ ప్రచారం చేస్తున్నారు..అలాగే బై బై కేసీఆర్ అని గతంలో ఏపీలో జగన్ అమలు చేసిన కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. గతంలో ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ..బై బై బాబు అంటూ ప్రచారం చేసింది..ఇంకా బాబు ఏపీలో అధికారంలోకి రారనే కోణంలో రాజకీయం చేసి జగన్ సక్సెస్ అయ్యారు..ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి అలాగే ముందుకెళుతున్నారు. మరి బై బై కేసీఆర్ అనే కాన్సెప్ట్ ఏ మేర వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.