హుజూరాబాద్ పాలిటిక్స్ : కాంగ్రెస్ నేత కౌషిక్ రెడ్డి ఆడియో లీక్, సంచలనం

0
102

బ్రదర్స్… ముందే ఫిక్స్
టికెట్ ఫైనల్… ఆడియో వైరల్

అంతా ముందే ఫిక్సైనట్టుంది. ఆ రకంగా ఇండికేషన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇంతకీ విషయం ఏంటంటారా!? అదేనండీ బాబు… ఇప్పుడు టిపిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ముడు హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అనుకుంటున్న నేత కౌశిక్ రెడ్డి ఆడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. తనకు టీఆర్ఎస్ టికెట్ ఫిక్స్ అయిందని… అందరినీ చూసుకుంటా (సొమ్ములు) టీం రెడీ అవ్వండి అంటూ ఆయన తన సన్నిహితుడితో మాట్లాడిన ఆడియో ఇప్పుడు లీకైంది.

సరే… కౌశిక్ టీఆర్ఎస్ లోకి వెళతాడన్న వార్త కొత్తదేం కాదు. కొద్ది రోజుల క్రితం ఆయన కేటీఆర్ తో డైనింగ్ టేబుల్ పంచుకున్నాడు. ‘కారె’క్కేటప్పుడు ఒకరి చెవి ఒకరు కొరుక్కుంటూ ముచ్చట్లాడుకున్నారు. అప్పుడే వికెట్ ఔట్ అనుకున్నారంతా… కొంచం టైం పట్టింది అంతే.

padi kaushik reddy

స్టోరీ ఇంకొంచం వెనక్కు వెళితే… నిన్నటి వరకు పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కు కౌశిక్ రెడ్డి స్వయానా తమ్ముడు. శివుడాజ్ఞలేకుండా చీమైనా కుట్టదన్నట్టు ఉత్తమ్ డైరెక్షన్ లేకుండా కౌశిక్ కాలు కదపడు అంటారు. ఇప్పుడు కాలేం కర్మ ఏకంగా మొత్తం బిచాణానే టీఆర్ఎస్ కు మార్చేస్తున్నాడు కౌశిక్. యవ్వారం చూస్తుంటే… కేటీఆర్ తో ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎప్పట్నుంచో టచ్ లో ఉన్నట్టున్నారన్న వాదన వినిపిస్తోంది. ఓ ఏడాది క్రితం అనుకుంటా…! ఉత్తమ్ హుజూర్ నగర్ లో ఓ మీటింగ్ లో మాట్లాడుతూ కేటీఆర్ ను పట్టుకుని డైనమిక్ లీడర్ అనేశాడు. అప్పుట్లో అదో పెద్ద పంచాయితీ అయింది. ఐతే ఏంటీ… మనసులో మాట అలా బయటపడిందిలే అనుకున్నారు టీ కాంగ్రెస్ లీడర్లు. తీరా నిన్న మొన్న తమ్ముడు వెళ్లి కేటీఆర్ తో గుసగుసలాడాడు. అదీ హల్ చల్ అయింది. అయినా, అప్పటికి పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుయ్యి కుటుక్కు మనలేదు. తమ్ముడిని వివరణ అడిగే ప్రయత్నం చేయలేదు.

దీనిని బట్టి లేటెస్ట్ డెవలప్ మెంట్ అన్నదమ్ముల ముందస్తు స్క్రిప్టేమో అని నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.