ఆ తెలంగాణ మంత్రి.. ఆడిదా? మగదా? : రేవంత్ రెడ్డి ఫైర్

0
103

ితెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం నాడు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. హైదరాబాద్ లో పార్టీ నేతలతో జరిగిన సమావేవంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయేన మాటల్లోనే చదవండి.

సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎలా వంచనకు గురైందో చర్చించాం. 7వ తేదీ తర్వాత అన్ని విభాగాల అధ్యక్షులతో చర్చించి భవిష్యత్ కార్యచరణ నిర్ణయిస్తాం. నీళ్లు ఈ రోజు జీవన్మరణ సమస్య. అలాంటి నీళ్లను ఏటీఎం ల మాదిరిగా మార్చుకున్నారు. ఎప్పుడు ఓట్లు కావాలన్నా.. నీళ్లను చూపిస్తడు కేసిఆర్. అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం.. పరివాహాక ప్రాంతం కాకుండా ఇతర చోట్లకు పంపడం కరెక్ట్ కాదు. ఈ రోజు కేసీఆర్ కావాలని లేని పంచాయతీ ని సృష్టిస్తున్నడు. ఏపీ సీఎం జగన్ కృష్ణా నీటిని రోజు కు 11 టీఎంసీ లు తరలించేలా ప్లాన్ చేస్తున్నడు. తెలంగాణ లో మాత్రం అన్ని ప్రాజెక్టులకు కలిపి రోజుకు ఒక టీఎంసీ మాత్రమే వాడుకోగలం.

నీళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదిగా మారి.. కాసుల కోసం తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెడుతున్నారు. జలాల కోసం ప్రభుత్వం పోరాటం చేయాలి కానీ… రాయలసీమ ఎత్తిపోతల మీద సామాన్య రైతు గవినొళ్ల శ్రీనివాస్ పిటిషన్ వేశాడు. రైతు వేసిన పిటిషన్ లో అనుకూలంగా తీర్పు వచ్చాక.. ప్రభుత్వం ఇంప్లీడ్ కావడం సిగ్గుచేటు. రెండున్నర కోట్ల ప్రజల జీవితాల మీద మరణ శాసనం రాస్తుంటే.. సీఎం కేసీఆర్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నడు.

జూలై 8 న రాజశేఖర రెడ్డి కూతురు రాజకీయ పార్టీ పెడుతుందట. ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి అంటే ఒక శకం.. సంక్షేమం ద్వారా చేయాల్సింది చేశారు. వారంటే తెలంగాణ సమాజానికి అభిమానం ఉంది. వారి కొడుకు జగన్ పిలిచి.. పర్వాన్నం పెట్టి.. మంత్రులతో తిట్టిస్తున్నారు. తెలంగాణ కు ఇరిగేషన్ మంత్రి ఎవరున్నారు.. ఆడిదా మొగోడా? నాగార్జున సాగర్ మీద గస్తీ పెట్టారట. ఎందుకు సాగర్ తెలంగాణ లో లేదా..?

జగన్ మాటలు సిగ్గుచేటు. రాజశేఖర రెడ్డి ని తిట్టరాని తిట్లు తిడుతుంటే విజయమ్మ, జగన్ ఎందుకు స్పందించరు. రాజశేఖర రెడ్డి ని తిట్టడం ద్వారా రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారు. తెలంగాణ కోడలు అని చెప్పిన షర్మిల.. ఈ నీళ్ల దోపిడీ కరెక్ట్ కాదా.. చెప్పలి? కాంగ్రెస్ కు గతంలో అనుకూలంగా ఉన్న వ్యక్తులు, శక్తులు మళ్లీ తిరిగి వస్తుంటే.. కేసీఆర్ సహించలేక కుట్రలు చేస్తున్నారు.

ఈ రోజు నీళ్ల దోపిడీ లో రాజశేఖర రెడ్డి పాత్ర లేదు.. ఆయన కుమారుడు జగన్ హస్తం ఉంది. కాంగ్రెస్ అభిమానులను తప్పు దారి పట్టించేందుకు కేసీఆర్ డ్రామా చేస్తున్నారు. జూరాల నుంచి బయలుదేరిన నీళ్లు రాయలసీమ లిప్ట్ ద్వారా స్వాహా చేసే స్కెచ్ వేస్తున్నడు. ఈ జల దోపిడీ కి కారణం సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నాను. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ .. కృష్ణా జలాలను ఏవిధంగా తరలిస్తానో స్పష్టంగా చెప్పారు. జగన్ చెప్పిన తర్వాత.. ప్రగతి భవన్ లో స్వాగతం పలికి భోజనం పెట్టాడు. కేసీఆర్ కు అన్ని విషయాలు చెప్పాకే.. ప్రగతి భవన్ నుంచి వచ్చాక జీవో వచ్చింది. ఏపీ నీటి దోపిడీ పై నాగం జనార్దన్ రెడ్డి.. సీఎం కేసీఆర్, గవర్నర్ కు లేఖ రాసిన స్పందించలేదు.

కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ కృత్రిమ పంచాయతీ పెడుతున్నడు.. ఆ ట్రాప్ లో ఎవరూ పడొద్దు. జల వివాదాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందారని చూస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులను .. షర్మిల వైపు నడిపించేందుకు కేసీఆర్ నడిపిస్తున్న డ్రామా ఇది. వైఎస్సార్, ఎన్టీఆర్ లు రాజకీయాలకు అతీతులు వారిని విమర్శించే వాడు నికృష్టుడే. దోపిడీ పై విచారణ అంటే ప్రధానమంత్రి మోదీ ని కలిసిన కేసీఆర్.. నీటీ విషయంలో ఎందుకు కలవడు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నీ ఎంపీలను నా వెంట పంపు నేను చూస్తా..తెలంగాణ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందా.. కోర్టులో కేసులు ఎందుకు వేయరు? రాజశేఖర రెడ్డి ని తిట్టడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా. రోజా ఇంటికి పోయి.. బేషిన్లు లేవు భేషజాలు లేవని చెప్పింది కేసీఆర్ కాదా?

షర్మిల ఏదో మాట్లాడాలని .. అవగాహన లేకుండా మాట్లాడుతుంది. ఆమె తిట్టాలంటే రాజశేఖర రెడ్డి ని అనదలచుకుందా..? రాజశేఖర రెడ్డి 1983 వరకు రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచారు. నేను కాంగ్రెస్ తరపున గెలిచిన వాన్ని.. ఆమె రాజకీయాలు తెలుసుకొని మాట్లాడాలి. భావోద్వేగాలతో రెచ్చగొట్టే వారిని సామాజిక బహిష్కరణ చేయాలి.