తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా, బులిటెన్ రిలీజ్ : జిల్లాల వారీ లిస్ట్ ఇదే

Telangana Corona Cases Bulletin Released

0
33

తెలంగాణలో గురువారం కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. నేటి బులిటెన్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఇవాళ కోవిడ్ పాజిటీవ్ కేసులు 869 మాత్రమే నమోదు అయ్యాయి. ఇవాళ జిహెచ్ఎంసి లో మాత్రమే త్రిబుల్ డిజిట్ కేసులు 101 నమోదయ్యాయి. మరింతగా కోవిడ్ తగ్గుముఖం పట్టింది. ఇవాళ మరణాల సంఖ్య 6 గా నమోదైంది. 12 జిల్లాల్లో ఇవాళ కూడా సింగిల్ డిజిట్ కేసులు నమోదు అయ్యాయి.
నేడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.
ఆదిలాబాద్ 4
కొత్తగూడెం 38
జిహెచ్ఎంసి 101
జగిత్యాల 19
జనగామ 7
జయశంకర్ భూపాలపల్లి 19
జోగులాంబ గద్వాల 4
కామారెడ్డి 4
కరీంనగర్ 51
ఖమ్మం 52
కొమరం భీం ఆసిఫాబాద్ 4
మహబూబ్ నగర్ 17
మహబూబాబాద్ 35
మంచిర్యాల 42
మెదక్ 6
మేడ్చల్ మల్కాజ్ గిరి 41
ములుగు 20
నాగర్ కర్నూల్ 6
నల్లగొండ 72
నారాయణపేట 5
నిర్మల్ 8
నిజామాబాద్ 8
పెద్లపల్లి 45
రాజన్న సిరిసిల్ల 22
రంగారెడ్డి 65
సంగారెడ్డి 10
సిద్దిపేట 28
సూర్యాపేట 54
వికారాబాద్ 8
వనపర్తి 9
వరంగల్ రూరల్ 12
వరంగల్ అర్బన్ 33
యాదాద్రి భువనగిరి 20
తెలంగాణలో ఇవాళ కరోనా నుంచి 1197 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,24,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 607658 మంది డిచ్చార్జ్ అయ్యారు. మొత్తం 3669 మంది మరణించారు.
ఇవాళ 105123 మందికి పరీక్షలు జరిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13052 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

ఈ వార్త కూడా చదవండి….

ఎపిలో పెరిగిన కరోనా కేసులు : ఆ జిల్లాలో జీరో డెత్స్, బులిటెన్ రిలీజ్