బండి పాయె.. గుండు పాయె : బండి సంజయ్ పై రేవంత్ రెడ్డి పంచ్

0
107

బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి సైటర్స్ వేశారు. జిహెచ్ఎంసి లింగోజిగూడ డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖరరెడ్డి మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మల్కాజ్ గిరి ఎంపీ, నూతనంగా ఎంపికైన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయనకు మేయర్ గద్వాల విజయలక్ష్మి స్వాగతం పలికారు.

అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై ఘాటైన విమర్శలు చేశారు. పనిలోపనిగా సిఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ మీద కూడా రేవంత్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జిహెచ్ఎంసి ఎన్నికలు ముగియగానే వరదల్లో ముగినిపోయిన కుటుంబీలకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్నికలు అయిపోగానే బంద్ చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడారో.. కింద వీడియో లింక్ ఉంది ఓపెన్ చేసి చూడొచ్చు.