కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్

TPCC Rewanth Reddy fires at central and state governments

0
93

గత వారం రోజుల నుంచి టీఆర్ఎస్ ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. నేను చెప్పిన విధంగానే ఈ రోజు టీఆర్ఎస్ ఎంపీలు అదే పని చేశారు.పార్లమెంటు శీతాకాల సమావేశాలు బైకాట్ చేస్తారని నేను నిన్న చెప్పాను. మోడీ. కేసీఆర్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే వాళ్ళు వాకౌట్ చేశారు.

ముఖ్యమంత్రి గత ఢిల్లీ పర్యటనలో ఢిల్లీ పైన దండయాత్ర, అగ్గిపుట్టిస్తానని కాళీ చేతులతో వెళ్ళారు.ఢిల్లీ పై అగ్గి పుట్టిస్తానని ఏమి చేయకుండా ఫామ్ హౌస్ లో పెగ్గు తాగి పడుకున్నారు. గత రెండు నెలల నుంచి రైతులు రాష్ట్రంలో అష్టకష్టాలు పడుతున్నారు. రోజు 4, 5 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఢిల్లీ పర్యటలో ఏమి చేశారో ఇప్పటివరకు చెప్పలేదు కేసీఆర్.తెలంగాణలో వరి సమస్య తీరిందా.కేంద్రం ఏమైనా నిర్ణయం తీసుకుందా హామీ ఇచ్చిందా?

ఎందుకు శీతాకాల సమావేశాలు ఎంపీలు వాకౌట్ చేశారు. ఢిల్లీ నుంచి గల్లీకి ఎందుకు వెళ్తున్నారు. శీతాకాల సమావేశాల్లో ఢిల్లీ మెడలు వంచుతాం అని ఇప్పుడు గల్లీ బాట పట్టారు. చనిపోయిన రైతు కుటుంబాలకు 25 లక్షలు నష్టపరిహారం కనిపించాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాలు వాయిస్ పక్కదోవ పట్టించేందుకు టీఆర్ఎస్ ఎంపీలు పోడియం చుట్టూ ఆందోళన చేశారు.

ఈడిలకు, బిడిలకు భయపడను అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు కేంద్రానికి భయపడుతున్నారు. హైదరాబాదు శివార్లలో మూడు వేల కోట్ల విలువైన భూముల విషయంలో కేసీఆర్ సన్నిహితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. వారందరినీ పిలిచి విచారించింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 15 సంవత్సరాల క్రితం విదేశీ కంపెనీలకు 450 కోట్లకు ఈ భూములను అప్పట్లో అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి నుంచి బలవంతంగా 350 కోట్లకు కొనుగోలు చేశారు.

హైదరాబాద్ కు చెందిన పెద్ద రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్, టివి యజమానికి ఈ భూములు కట్టబెట్టారు.కెసిఆర్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ వ్యవహారం జరిగింది. హెచ్ఎండిఏ సంబంధించిన పరిధిని అంతా అప్పట్లో కేటీఆర్ సంబంధించిన మంత్రి ఆధ్వర్యంలో జరిగింది. ఈడి కేసులను నుంచి తప్పించుకునేందుకే కేసీఆర్ పార్లమెంట్ లో ఎంపీలను ఆందోళన చేయమని చెప్పారు. భూముల వ్యవహారంలో కేటీఆర్ ని ఈడి పిలిపించాలని చూసింది కానీ చివరి నిమిషంలో వాయిదా పడ్డది.

భూముల అక్రమాలలో మంత్రి కేటీఆర్ సంతకం చేశారు. బిజెపి కేటీఆర్ పై కేసులు తాత్కాలికంగా వాయిదా వేయడం వల్లనే పార్లమెంట్ ని వాకౌట్ చేశారు. రాజకీయ ఒడంబడికల భాగంగానే టిఆర్ఎస్ బిజెపి లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. టిఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో ఎక్కడ కనిపించినా కోడిగుడ్లు, రాళ్లు , కర్రలతో కొట్టాలని పిలుపునిచ్చారు.నిజాం వారసుల కంటే కేసీఆర్ వారసులు శ్రీమంతులు అయ్యారని రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు.