కరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు… బ్రిటన్ ప్రధానిని ఆఫ్రికాలో ఉన్న బెగ్గర్ ను వదలడంలేదు… ఇక కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యులను కూడా వదలడంలేదు… ఇప్పటికే పలువురు వైద్యులకు కరోనా పాజిటవ్ అని తేలడంతో వారు చికిత్స పొందుతున్నారు…
తాజాగా ఢిల్లీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది… కొద్దిరోజులుగా ఆయన దగ్గు జ్వరంతో బాధపడుతుండగా ఆయన్ను ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది… దీంతో అప్పప్రమత్తమైన అధికారులు అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు…
ఆతని కుటుంబ సభ్యులతో పాటు ఎవరెవరితో మాట్లాడారు అన్న దానిపై అధికారులు ఆరాతీసుకున్నారు… ఇప్పటివరకు వైద్య సిబ్బందికి మాత్రమే కోవిడ్ 19 సోకింది… తాజాగా ఇతర శాఖల సిబ్బందికి సోకడంతో కొందరు ఆందోళకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి.. దీంతో అధికారులు కూడా అప్రమత్తమై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.