టీఆర్ఎస్ ఢీ కొట్టేందుకు విజయశాంతి రెడీ అయిందా…

టీఆర్ఎస్ ఢీ కొట్టేందుకు విజయశాంతి రెడీ అయిందా...

0
84

త్వరలో జరుగనున్న దుబ్బాక ఉపఎన్నికల సందడి మొదలైంది… ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేట దిశగా అడుగులేస్తున్నాయి.. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో జెండా ఎగరవేయాలని బీజేపీ కాంగ్రెస్ భావిస్తుండగా తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది…ప్రధాన పార్టీలన్నీ బలమైన అభ్యర్థులనే రంగంలోకి దింపేలా పావులు కదుపుతున్నాయి…

బీజేపీ నుంచి రఘునందన్ రావు పేరు వినిసిస్తుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైర్ బ్రాండ్ విజయశాంతి పేరు పరిశీలిస్తున్నారు.. అంతేకాదు దుబ్బాకలో విజయశాంతి పోటీకి సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి…అయితే అధికార పక్షం అయిన టీఆర్ఎస్ పార్టీ మాత్రం టికెట్ కేటాయింపు అంశంపై స్పష్టత రావాల్సి ఉంది…

కాగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన విజయశాంతి రాజకీయాల్లోఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకుంది… మెదక్ ఎంపీ గా ఉమ్మడి జిల్లాపై మంచి పట్టుఉంది… అంతేకాదు అన్ని పార్టీలతో ఆమెకు మంచి సంబాంధాలు ఉన్నాయి..