షర్మిలకు షాక్ ఇచ్చిన టిఆర్ఎస్ : ఏమైందంటే ?

TRS gave a shock to Sharmila

0
132

తెలంగాణలో పార్టీ పెట్టి పాగా వేసేందుకు వైఎస్సార్ కూతురు షర్మిల కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కేసిఆర్ వదిలిన బాణమే షర్మిల అంటూ ఒకవైపు విమర్శలు వినిపిస్తుండగా ఆమె మాత్రం నేరుగా కేసిఆర్ కే గురిపెడుతున్నారు.
ఇక ఆమెను టాలరేట్ చేయకూడదనుకున్నారేమో టిఆర్ఎస్ వాళ్లు హుజూర్ నగర్ లో షాక్ ఇచ్చారు. అక్కడేమైందంటే… బుధవారం వైఎస్ షర్మిల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ముందుగా మిర్యాలగూడలో పర్యటించారు. పట్టణంలోని బంగారుగడ్డ లో ఎండీ సలీం కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం హుజూర్ నగర్ వెళ్లారు. హుజూర్ నగర్ పరిసరాల్లోని మేడారం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నీలకంఠ సాయి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. కానీ నీలకంఠ ఇంటికి తాళం వేసి ఉంది. తమ నాయకురాలు షర్మిల వస్తున్నారని తెలిసి టిఆర్ఎస్ వాళ్లు కావాలనే నీలకంఠ కుటుంబాన్ని తరలించారని వైఎస్సార్ టిపి నేత పిట్టా రాంరెడ్డి ఆరోపించారు.
అయితే నీలకంఠ ఇంటిముందే షర్మిల నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించి టిఆర్ఎస్ వాళ్లకు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి షర్మిల పార్టీ టిఆర్ఎస్ కు గట్టి సవాల్ విసిరేనా అన్న వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.