ట్రంప్ ఎందుకు సులేమానిని టార్గెట్ చేశారు వరల్డ్ వార్ వస్తుందా

ట్రంప్ ఎందుకు సులేమానిని టార్గెట్ చేశారు వరల్డ్ వార్ వస్తుందా

0
36

ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసీం సులేమానీ చనిపోయాడు అని తెలియడంతో పెద్ద ఎత్తున ఆయన సన్నిహితులు ఆయన వెంట నడిచేవారు నిరసనలతో అమెరికా కార్యాలయంపై ఎంబసీపై దాడులకి దిగుతున్నారు.. ట్రంప్ మళ్లీ ఇరాన్ కు వార్నింగ్ ఇవ్వడంతో ఇరాన్ కూడా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని అధినేత వార్నింగ్ ఇచ్చారు.

దీంతో ఇరాన్ ఆర్మీని నడిపే సులేమాని చనిపోవడంతో అమెరికాపై యుద్దానికి ఇరాన్ రెడీ అవుతోంది
ఖాసీం సులేమాన్ ని డ్రోన్ తో చంపేశారు అని అత్యంత శక్తివంతమైన రాకెట్స్ ప్రయోగించారు అని తెలుస్తోంది.
దీంతో మూడో ప్రపంచ యుద్దం స్టార్ట్ అయింది అని సోషల్ మీడియాలో లక్షలాది మంది కామెంట్స్ పెడుతున్నారు

ఇరాన్ లో రెండో అత్యంత శక్తివంతమైన నేత ఆర్మీ కమాండర్ ఖాసీం సులేమానీ కొనసాగుతున్నారు, ఇరాక్ లో బాగ్దాద్ లో వేలాది మంది నిరసన కారులు అమెరికా ఎంబసిపై దాడి చేసి అక్కడ నిప్పు అంటించారు, ఈ హింసా కాండలో రాయబార కార్యాలయం నాశనం చేశారు.

ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మా ఆస్తులకి ఎలాంటి నష్టం కలిగినా మీదే బాధ్యఅని ట్రంప్ ట్వీట్ చేశారు తర్వాత సులేమాని ట్రంప్ ని విమర్శించడంతో ఇది దాడికి కారణం అయింది చివరకు సులేమాని ప్రాణాలు కోల్పోయారు. దశాబ్దాలకు పైగా ఇరాక్ పై అమెరికా పెత్తనం ఉంది గ్రీన్ జోన్ లో అమెరికా ఆర్మీ ఉంటారు అనేది తెలిసిందే, అక్కడ మిలిటెంట్ల దాడితో ఈ వివాదం రాజుకుంది.