అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ముగిసింది, ఇక నిన్న రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొన్నారు.. వరుసగా నేతలను కలుస్తూ వచ్చిన ట్రంప్.. కేసీఆర్ కు కరచాలనం చేసి, కొన్ని క్షణాలు మాట్లాడారు.
హైదరాబాద్ లో నిర్వహించిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సు విషయాన్ని ప్రస్తావించారు. తన కుమార్తె ఇవాంకా హాజరైన ఆ సదస్సుకు తెలంగాణ ఇచ్చిన ఆతిథ్యం భేష్ అని అభినందించారు.
ఢిల్లీ విందు సందర్భంగా సీఎం కేసీఆర్ ట్రంప్ కు మంచి బహుమతి అందించారు, కరీంనగర్ కు చెందిన కళాకారులు తయారు చేసిన వెండి ఫిలిగ్రీ కళాకృతులను ట్రంప్ కు బహూకరించారు. ఇందులో చార్మినార్, నెమలి, కాకతీయ కళాతోరణం, వీణ వంటి ఆకృతులు ఉన్నాయి. ఇక ట్రంప్ సతీమణి మెలనియాకు ఎర్ర రంగు పోచంపల్లి పట్టుచీరను బహూకరించినట్టు తెలుస్తోంది.