సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులకు పండగే. అలాంటిది ఒకరోజు, రెండురోజులు కాదు ఏకంగా 15 రోజుల సెలవులు రాబోతున్నాయ్. ఇక ఇప్పుడు పండుగ కాదు అంతకుమించి. దసరా పండుగ సందర్బంగా సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాల అకాడమిక్ క్యాలెండర్ లో వివరాలు పొందుపరిచిన విషయం తెలిసిందే.