TSRTC బంపరాఫర్..వారికి సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

TSRTC bumper..free travel on city buses for them

0
103

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సజ్జనార్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తనదైన నిర్ణయాలతో లాభాల దిశగా నడిపేందుకూ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆఫర్లతో, వినూత్నమైన ఆలోచనతో ముందుకెళ్తున్న ఆర్టీసీ తాజాగా మరో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

దూర ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. 250 కిలోమీటర్లు పైగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి నగరానికి చేరుకున్న ప్రయాణికులు రెండు గంటల లోపు సిటీ బస్సులో నగరవ్యాప్తంగా ఎక్కడైనా ఉచితంగా వెళ్లవచ్చని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. నాన్‌ ఏసీ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు నాన్‌ ఏసీ సిటీ సర్వీసుల్లో, ఏసీ బస్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ఏసీ సర్వీస్‌ల్లోనూ, నాన్‌ ఏసీ బస్సుల్లోను ప్రయాణించే వెసులుబాటు ఉందని తెలిపారు.

కాగా ఇటీవల సంక్రాంతి, మేడారం జాతర, మహాశివరాత్రి పర్వదినాలను పురస్కరించుకుని.. భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. 30 మందితో కూడిన భక్తులు ఒక గ్రూపుగా ఏర్పడితే తమ నివాసానికి సమీప ప్రాంతం నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఎండీ సజ్జనార్ నేతృత్వంలో 60 మంది అధికారుల బృందం మేడారం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాండ్ వద్దే బస చేసి ఆర్టీసీ సేవలను పర్యవేక్షించారు. ఈ జాతరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 4 వేల బస్సులను ఆర్టీసీ నడిపించింది. ఇందుకోసం 12,500 మంది సిబ్బంది విధులు నిర్వర్తించారు.