టీటీడీ ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్ మారింది కొత్త‌ది ఇదే త‌ప్ప‌క చూడండి

టీటీడీ ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్ మారింది కొత్త‌ది ఇదే త‌ప్ప‌క చూడండి

0
43

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్ధానానికి నిత్యం ల‌క్ష‌లాది మంది భ‌క్తులు వ‌స్తూ ఉంటారు, అయితే స్వామి సేవ‌ల‌కు సంబందించి అన్నీ సేవ‌ల‌కు గాను టికెట్స్ కూడా ముందు తీసుకుంటారు, అయితే దీనికి సంబంధించి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్ ఇప్ప‌టి వ‌ర‌కూ https:/ttdsevaonline.com ఈ వెబ్ సైట్ వాడేవారు.

కాని తాజాగా ఈ స‌ర్వీస్ వెబ్ సైట్ ని మార్చారు, కొత్త‌గా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆర్జితసేవలు, దర్శనం, బస, కల్యాణమండపాలు తదితర ఆన్‌లైన్ సేవలను బుక్ చేసుకోవడానికి అలాగే ఈ-హుండీ, ఈ-డొనేషన్స్ సౌకర్యం కోసం https:/tirupatibalaji.ap.gov.in గా కొత్త వెబ్ సైట్ ని మార్చారు.

దీనిని టీటీడీ ప్రకటించింది. మార్చిన పేరు గల వెబ్‌సైట్ రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. . స్వతంత్రంగా ఉన్న టీటీడీ వెబ్ సైట్‌ను ప్రభుత్వ సైట్‌కు అనుబందంగా మారుస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు.

ఇక తిరుమ‌ల సేవ‌ల‌కు గాను ఈ వెబ్ సైట్ ని వాడండి.
కొత్త లింక్… https:/tirupatibalaji.ap.gov.in