కాంగ్రెస్ లో కల్లోలం..రేపు సంచలన నిర్ణయం తీసుకోనున్న జగ్గారెడ్డి

0
76
Hath se Hath Jodo

తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ కల్లోలం నెలకొంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు నిన్న హైదరాబాద్ లో స్వాగతం పలకడానికి తెరాస భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దూరంగా ఉండాలని పీసీసీ చీఫ్ రేవంత్ సూచించారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ స్వాగతం పలకడానికి వెళ్లడంతో మళ్లీ రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. విహెచ్ వెళ్తే తప్పేంటని జగ్గారెడ్డి తన అభిప్రాయాన్ని తెలిపారు. కాంగ్రెస్ వెళ్లాల్సి ఉండాల్సిందని ఆయన ఉద్గటించారు.

ఈ క్రమంలో జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. రేపు కీలక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తప్పిన అనే అవేదనలో తాను ఉన్నానని.. పార్టీ అంతర్గత అంశాలు మీడియా లో మాట్లాడనని మాటిచ్చానని పేర్కొన్నారు. కానీ రేవంత్ వ్యవహారం వల్లనే మాట తప్పావని… పార్టీ చీఫ్ కి రాజకీయ వ్యూహం ఉండాలని తెలిపారు.

తొమ్మిదేండ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి టీడీపీ నాయకుడిగా ఉన్నపుడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రాజకీయ అతి ఉత్సాహంలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో రాజకీయంగా కనుమారుగైపోయిండు.ఈ రోజు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉండి కూడా లేన్నట్లుగానే జీవిస్తున్నాడని ఎద్దేవా చేశారు.