పోలీసులకు లొంగిపోయిన tv9 రవిప్రకాష్..!!

పోలీసులకు లొంగిపోయిన tv9 రవిప్రకాష్..!!

0
106

ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ 9 లో వాటాల వివాదంలో నూతన యాజమాన్యాన్ని మోసం చేసి, ఫోర్జరీ కేసులో చిక్కుకుని గత కొంత కాలంగా పరారీలో ఉన్న మాజీ సీఈవో రవి ప్రకాష్ ఎట్టకేలకు ఈ రోజు సైబరాబాద్ పోలీసుల ముందు హాజరయ్యారు. రవి ప్రకాష్‌పై నమోదైన రెండు కేసుల నేపథ్యంలో సైబర్‌క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని పోలీసులు ముందుగా రవిప్రకాష్‌కు 160 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చారు. వాటికి స్పందించక పోవడంతో 41సీఆర్పీసీ నోటీసులు జారీచేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు రవిప్రకాష్ కోసం గాలింపు తీవ్రతరం చేశారు.

అయితే ఏపీలో టీడీపీ పెద్దల సహకారంతో రవి ప్రకాష్ తలదాచుకున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇంతలోనే ఏపీలో వైయస్ జగన్ అధికారంలోకి రావడంతో అక్కడ ఉండడం సేఫ్ కాదని భావించిన రవిప్రకాష్ ఏపీని వదిలి..గుజరాత్‌కు వెళ్లాడని సమాచారం. దీంతో రవి ప్రకాష్ కోసం గుజరాత్‌కు కూడా తెలంగాణ పోలీసులు వెళ్లారు. అయినా రవిప్రకాష్ మాత్రం పోలీసులకు చిక్కకుండా రహస్యం జీవితం గడుపుతున్నాడు. ఈ మేరకు పోలీసులకు చిక్కకుండా రవి ప్రకాష్ దాదాపు 30 కు పైగా సిమ్ కార్డులు మార్చినట్లు తెలుస్తోంది. ఏదైతేనేం చివరికి రవిప్రకాష్ పోలీసులకు లొంగిపోయాడు..