స్వరూపానందేంద్ర సరస్వతిని స్వామీజీని కలిసిన జగన్…!!

స్వరూపానందేంద్ర సరస్వతిని స్వామీజీని కలిసిన జగన్...!!

0
76

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా వైజాగ్ లో అడుగుపెట్టారు. విశాఖలోని శ్రీ శారదపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిని కలుసుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో స్వామివారి వద్దకు విచ్చేసిన జగన్ కు ఆశ్రమంలో ఘనస్వాగతం లభించింది.

ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సీఎం జగన్ తో రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం పవిత్ర కుంకుమను జగన్ నుదుట అద్దారు. ఈ సందర్భంగా జగన్, స్వరూపానందేంద్ర మధ్య కాసేపు చర్చ జరిగింది. స్వామివారు పీఠంపై ఆసీనులు కాగా, జగన్ సాధారణ భక్తుడిలా నేలపై కూర్చున్నారు.