రెండు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్న జగన్ బిగ్ ప్లాన్

రెండు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్న జగన్ బిగ్ ప్లాన్

0
71

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ సీఎంగా అయిన తర్వాత నెరవేరుస్తున్నారు… పూర్తిగా జగన్ నవరత్నాలపై ఫోకస్ చేశారు అనే చెప్పాలి .. ముఖ్యంగా చంద్రబాబు ఓటమికి కూడా ఇదే కారణం.. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన ఏ హమీని నెరవేర్చకుండా చెప్పినవని చెప్పనివి కూడా చేశాము అని ప్రచారం చేసుకున్నారు.

అయితే జగన్ కు కనివిని ఎరుగని భారీ మెజార్టీ రావడంతో ఆయన మాత్రం తాను ఎన్నికల ముందు ఇచ్చిన అన్నీ వాగ్దానాలను నెరవేరుస్తున్నారు..తాజాగా జగన్ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుని నెలకో పథకం అమలు చేస్తోంది. అయితే జగన్ రెండు సంవత్సరాల టార్గెట్ పెట్టుకున్నారట.

మొత్తం ఈ రెండు సంవత్సరాలలో వీలైనంత వరకూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే నవరత్నాలు రెండు సంవత్సరాలలో పూర్తి చేసి అందరికి అందించాలి అని భావిస్తున్నారట.జగన్ నిర్ణయం బాగుంది అంటున్నారు ప్రజలు.. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం ఐదు సంవత్సరాలు జరుగుతుంది అని మిగిలిన అన్నీ పథకాలు రెండు సంవత్సరాలలో అందరికి అందేలా జగన్ నిర్ణయం తీసుకుంటున్నారట