Breaking News: సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై సర్వత్రా ఉత్కంఠ

Ubiquitous excitement over CM KCR press meet

0
73

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత సీఎం కేసీఆర్ మొదటి ప్రెస్ మీట్ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇక వచ్చే యాసంగి నుంచి వరి ధాన్యం కొనబోమని విధాన నిర్ణయం ప్రకటించింది ప్రభుత్వం. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ముందే హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఏం మాట్లాడతారోనని రైతాంగం ఎదురు చూస్తోంది.

ప్రధానంగా ఈ సమావేశంలో పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ దరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.పెట్రోల్‌, డీజిల్‌పై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించిది. పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గాయి. కేంద్రం బాటలోనే పలు రాష్ట్రాలు కూడా తమ వంతు పన్నును తగ్గించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధరలు మరింత తగ్గాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించాలన ప్రతిపక్షాలు ఎదురు దాడి మెదలు పెట్టాయి.

అలాగే తెలంగాణలో బస్‌ ఛార్జీలు పెరగబోతున్నాయి. త్వరలోనే దీనిపై కేబినెట్‌లో నిర్ణయం జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలపై కూడా సీఎం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.